పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంధి ఐపోతుందో కనిపించని కుట్రల
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంధి ఐపోతుందో కనిపించని కుట్రల
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంధి ఐపోతుందో కనిపించని కుట్రల
కుమ్మరి వామిలొ తుమ్మలు మొలిసెను
కమ్మరి కొలిమిలొ దుమ్ము పేరెను
పెద్ద బాడిస మొద్దు బారినది
సాలెల మగ్గం సడుగులిరిగినది
చేతి వృత్తుల చేతులిరిగిపాయే నా పల్లెల్లోన
అయ్యొ గ్రామ స్వరాజ్యం గంగలోన పాయే ఈ దేశంలోన
మడుగులన్ని అడుగంటి పోయినవి
బావులు సావుకు దగ్గరయ్యినవి
వాగులు వంకలు ఎండిపోయినవి
సాకలి పొయ్యిలు కూలిపోయినవి
పెద్ద బోరు పొద్దంత నడుస్తుందో బలిసీన దొరలవి
మరి పేద రైతుల బావులెందుకెండే నా పల్లెల్లోన
వీధులన్ని ఒట్టి ఒద్దులయ్యినవి
ఈత కల్లు బంగారవయ్యినది
మందు కలిపిన కల్లూ తాగిన
మంది కండ్ల నిండూసులయ్యినవి
చల్లని బీరు విస్కి లొ పడుగంతె నా పల్లెల్లోకి
అరె బుస్సున పొంగె పెప్సి కోల వచ్చే నా పల్లెల్లోకి
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంధి ఐపోతుందో కనిపించని కుట్రల
పరక సాపలకు గాలాలేసె
తురక పోరలు యాడికిపోయిరి
లారీలల్లొ క్లీనర్లయ్యిర పెట్రోల్ మురికల మురికయ్యిన్ర
తల్లి దూదు సేమియాకు దూరమయ్యినార
సాయబు రాక పోరలు
ఆ బేకరి కెఫ్ లొ ఆకలి తీరిందా ఆ పట్టణాలలొ
పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల
నా తల్లి బంధి ఐపోతుందో కనిపించని కుట్రల
పల్లె కన్నీరు పెడుతుందో
ReplyDelete